పొట్టుపొట్టు కొట్టుకుంటున్న మహేష్, బన్నీలు.. ఇక్కడ కాదు అక్కడ!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాయా అంటూ అందరి చూపులు ఈ సినిమాలపై ఉన్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాలకంటే కూడా ఈ సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ నెలకొంది.
ముఖ్యంగా మహేష్ బాబు చిత్రాలకు ఓవర్సీస్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది.ఆయన సినిమాలకు అక్కడ భారీ ఓపెనింగ్స్ వస్తాయి.
దీంతో సరిలేరు నీకెవ్వరు చిత్రం ఎలాంటి రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా అదే సమయంలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాకు కూడా అంతే క్రేజ్ నెలకొంది.
దీనికి కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.ఈ దర్శకుడి సినిమాలకు ఓవర్సీస్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ‘అ ఆ’ సినిమా రిజల్ట్‌తో తెలుస్తోంది.
అలాంటి దర్శకుడితో బన్నీ కాంబినేషన్ అనగానే అల వైకుంఠపురములో సినిమాపై కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
మరి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ-త్రివిక్రమ్‌ల అల వైకుంఠపురములో సినిమాల్లో ఏ సినిమాకు ఓవర్సీస్ జనం ఓటు వేస్తారో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఏదేమైనా పండగ పూట ఈ సినిమాలకు ఏర్పడిన క్రేజ్ మామూలుగా లేదంటున్నారు సినీ క్రిటిక్స్.
ఇక ఈ సినిమాలతో పాటు దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో పండగ విన్నర్ ఎవరవుతారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అడవిలో ఊహించని ఘోరం.. తండ్రీకొడుకులను చంపేసిన ఎలుగుబంటి.. షాకింగ్ వీడియో వైరల్!