ఐపీఎల్ లో ఆ రికార్డులను బద్దలు కొట్టడం పైనే మహేంద్రసింగ్ ధోని కన్ను..!

ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 ) కు అందరూ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ లతో, తమ స్ట్రాటజీలతో సిద్ధమయ్యారు.

ఇక భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni )ఈ ఐపీఎల్ తనకు లాస్ట్ అని ఎప్పుడు చెప్పలేదు.

కానీ చెపాక్ లో తన ఆఖరి ఐపీఎల్( IPL ) మ్యాచ్ ఆడతనని మాత్రం తెలిపాడు.

ఈ విషయంతో ఇదే ధోనీకు లాస్ట్ ఐపీఎల్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ ఐపీఎల్ సీజన్లో మూడు రికార్డులను బద్దలు కొట్టడానికి ధోని రెడీ అయినట్లు తెలుస్తుంది.

ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో మహేంద్రసింగ్ ధోని కూడా ఉన్నాడు.

2008 ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుండి ఐపీఎల్ కెరీర్లో 229 సిక్సర్లు బాదాడు.

ఇక ఈ సీజన్లో 21 సిక్సర్లు బాదితే.ఐపీఎల్ లో 250 సిక్సర్లు కొట్టిన ఏకైక భారతీయ బ్యాటర్ గా మొదటి స్థానం లో ఉండి, సరికొత్త రికార్డు ఖాతాలో పడుతుంది.

"""/" / ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడి గా మహేంద్రసింగ్ ధోని కి రికార్డ్ ఉంది.

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 234 మ్యాచ్లు ఆడాడు.ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ నాకౌట్స్ చేరితే, 250 మ్యాచులు ఆడిన రికార్డ్ ఖాతాలో పడుతుంది.

అంటే ఇంకా 16 మ్యాచులు ఆడాల్సి ఉంది.ధోని తరువాత స్థానంలో దినేష్ కార్తీక్ (229) ఉన్నాడు.

"""/" / ఐపీఎల్ లో 206 ఇన్నింగ్స్ లలో 4978 పరుగులు చేసి, 5 వేల పరుగులకు కేవలం 22 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఒంటి చేత్తో ఎన్నోసార్లు చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపించిన మహేంద్రసింగ్ ధోని ఈ సీజన్లో 22 పరుగులు చేస్తే, 5000 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరడం మే కాకుండా, ఈ ఘనత సాధించిన ఫుల్ టైం వికెట్ కీపర్ గా ఓ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.

చరణ్ మాటలు నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగే.. అసలేం జరిగిందంటే?