కెనడాలో దుండగుల దురాగతం.. మరోసారి మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం, వారంలో రెండో ఘటన

కెనడాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు.భారత జాతిపిత మహాత్మా గాంధీ ( Mahatma Gandhi )విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

బర్నాబీలోని సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో వున్న గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మంగళవారం ధ్రువీకరించింది.

ఈ విషయాన్ని అత్యవసరంగా దర్యాప్తు చేయాలని , నేరస్థులను కోర్టు ఎదుట హాజరుపరచాలని కాన్సులేట్ కార్యాలయం కోరింది.

కాగా.అంటారియో ప్రావిన్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్( Khalistan ) వాదులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్‌లో సమీపంలో గత గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

గాంధీ విగ్రహం 2012 నుంచి ఈ ప్రాంతంలోనే వుంది.ఆరు అడుగుల ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది.

గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో ప్రధాని నరేంద్ర మోడీపై( Prime Minister Narendra Modi ) విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.

అనంతరం విగ్రహం పక్కనే ఖలిస్తానీ జెండాను ఎగురవేశారు దుండగులు.అయితే విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు విగ్రహం వద్ద పిచ్చిరాతలు చెరిపివేసి, శుభ్రం చేశారు.

గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక భారతీయ కమ్యూనిటీ భగ్గుమంది. """/" / ఇదిలావుండగా.

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాత్ సింగ్ ( Amritpath Singh )వ్యవహారంతో పంజాబ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

దాదాపు పది రోజుల నుంచి ఆయనను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ నేటి వరకు అమృత్‌పాల్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.ఉత్తరాఖండ్‌లో వున్నాడని, టోల్‌గేట్ మీదుగా ఆయన కారు వెళ్లిందని ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కానీ అమృత్‌పాల్ మాత్రం చిక్కడం లేదు.భారత్‌ను వీడి నేపాల్( Nepal ) మీదుగా కెనడా పారిపోవాలన్నది ఆయన వ్యూహాంగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే దేశ సరిహద్దుల్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది.బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, భారత సైన్యం ఎక్కడికక్కడ దిగ్భంధించేశాయి.

"""/" / ఇతని వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.

ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతున్నారు.

MLA Danam Nagendar : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ