'మహర్షి' సెన్సార్‌ రిపోర్ట్‌... సెన్సార్‌ బోర్డు సభ్యుల స్పందన ఏంటో తెలుసా?

మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'మహర్షి'.

ఈ చిత్రంను దిల్‌రాజు అశ్వినీదత్‌ మరియు పీవీపీలు నిర్మించారు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది.

ఈ చిత్రంను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు కూడా క్లీయరెన్స్‌ ఇచ్చింది.

ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు నుండి యూ/ఎ సర్టిఫికెట్‌ దక్కింది.ఈ చిత్రంకు క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారట.

అయితే కొన్ని యాక్షన్‌ సీన్స్‌ ఉన్న కారణంగా ఈ చిత్రంకు యూ/ఎ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంపై సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెన్సార్‌ బోర్డు సభ్యులకు కథ బాగా నచ్చడంతో పాటు, మహేష్‌బాబు పాత్ర మరియు అల్లరి నరేష్‌ ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నాయట.

చిత్ర నిర్మాతలకు ఈ చిత్రం బాగుందంటూ స్వయంగా సెన్సార్‌ బోర్డు వారు శుభాకాంక్షలు తెలపడం కూడా జరిగిందని ఫిల్మ్‌ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

"""/"/ భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం మహేష్‌ బాబు కెరీర్‌ లో 25వ చిత్రం అనే విషయం తెల్సిందే.

మైలు రాయి చిత్రం అవ్వడం వల్ల మహేష్‌బాబు చాలా ఓప్స్‌ ఈ చిత్రంపై పెట్టుకున్నాడు.

అందుకే ఈ చిత్రంను చాలా జాగ్రత్తలు తీసుకుని, దాదాపు సంవత్సర కాలం పాటు వెయిట్‌ చేసి మరీ మహేష్‌బాబు చేయడం జరిగింది.

ఈ చిత్రంలో మొదటి సారి మహేష్‌బాబు గడ్డం మీసాలు పెంచుకుని కనిపించడంతో పాటు, ఒక రైతుగా కూడా నటించాడు.

మహేష్‌బాబు కెరీర్‌లో నిలిచి పోయే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరి ఈ చిత్రం ఎలా ఉంటుందనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది.

జ్యోతిక బిహేవియర్ బాలేదు.. భార్యాభర్తలు కలిసుండాలి.. నటుడి సంచలన వ్యాఖ్యలు!