మహర్షి సినిమా రిలీజ్ కి ముందే అంచనాలు దాటేస్తుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి.

ఈ సినిమా మరో నాలుగు రోజులలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.మహేష్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్స్టు క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఈ సినిమా బాహుబలి రికార్డ్ ని కూడా ఓ విషయంలో బ్రేక్ చేసింది అని చెప్పాలి.

రిలీజ్ కి ఒక రోజు ముందు యూఎస్ లో మహర్షి సినిమా ప్రీమియర్స్ కి సిద్ధం అవుతుంది.

ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్ కోసం యూఎస్ లో ఏకంగా 2500 థియేటర్స్ సిద్ధం అవుతున్నాయి.

ఇప్పటి వరకు యూఎస్ లో ఒక్క బాహుబలి సినిమా మాత్రమే తెలుగులో 2000 థియేటర్స్ ప్రీమియర్ ప్రదర్శించ బండింది.

అయితే ఇప్పుడు మహర్షి సినిమా ప్రీమియర్స్ విషయంలో బాహుబలి రికార్డ్ ని అధికమించింది అని చెప్పాలి.

మరో వైపు ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్ ద్వారా భారీగా టికెట్స్ బుక్ అవుతున్నాయి.

మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత తెలుగులో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఈరోజు జరిగే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?