ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
TeluguStop.com
నల్లగొండ జిల్లా:టిఎస్ఎస్పి అన్నెపర్తి 12 వ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి.
సాంబయ్య ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదనపు కమాండెంట్ బి.రామకృష్ణ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని మధురకావ్యంగా మలిచి మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి మహర్షి అని,ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న,ఆర్ఐలు బి.అశోక్,వై.
యుగందర్,టి.వెంకన్న మరియు
ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు.
మన హీరోలు మిగతా ఇండస్ట్రీ వాళ్ళను డామినేట్ చేస్తున్నారా..?