పోలీసులను చితకబాదిన కూలీలు.. అసలేం జరిగింది!
TeluguStop.com
కరోనా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీసులపై మహారాష్ట్ర నుండి వలస వచ్చిన కూలీలు దాడి చేశారు.
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను కూలీలు కొట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి లో ప్రైవేట్ కూలీలుగా విధులు నిర్వహిస్తున్న మహారాష్ట్ర వలస కూలీలు స్థానిక కోల్ బెల్ట్ వంతెన దాటే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
లాక్ డౌన్ అమలు ఉన్న ఈ సమయంలో వంతెన దాటేందుకు వీలు లేదు అంటూ కట్టడి చేయడంతో పోలీసు లపై వారు విరుచుకు పడ్డారు.
ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ మరియు ఇద్దరు హోం గార్డ్ లను కూలీలు చితక బాదారు.
వెంటనే ఎస్సై సమాచారం అందించడం తో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు వారిపై కఠిన చర్యలకు సిద్దం అయ్యారు.పోలీసు లపై దాడిని ఉన్నతాధికారులు మరియు సింగరేణి అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు.
వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.పోలీసులపై దాడి చేసిన వారు ప్రస్తుతం పెద్ద పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షురూ.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?