సుశాంత్ కేసులో నయా ట్విస్ట్.. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో

సుశాంత్ ఆత్మహత్య కేసుపై ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు ఓ వైపు విచారణ చేసి మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కేసుని క్లోజ్ చేయాలని అనుకున్న టైంలో సుశాంత్ తండ్రి బిహార్ లోని పాట్నా పోలీసులని ఆశ్రయించారు.

సుశాంత్ ప్రేయసి రియాకి అతని ఆత్మహత్యలో ప్రమేయం ఉందని, ఆమె కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కేసు పెట్టారు.

దానికి ఆధారాలుగా సుశాంత్ బ్యాంకు లావాదేవీలు జరిగిన విధానంలో అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ ఫిర్యాదు ఆధారంగా పాట్నా పోలీసులు సుశాంత్ ఆత్మహత్య మిస్టరీని చేధించడానికి రెడీ అయ్యారు.

అయితే రియాపై కేసు నమోదు చేసిన తర్వాత ఆమె, ఆమె కుటుంబం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

మరో వైపు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే సుశాంత్ కేసు విచారిస్తున్న పాట్నా పోలీసులకి ముంబై పోలీసుల సహాకారం అందడం లేదు.

విచారణలో భాగంగా బీహార్ పోలీసులు దిషా సాలియ‌న్ మ‌ర‌ణంపై కేసు న‌మోదైన ముంబైలోని మ‌ల్వానీ పోలీస్ట్ స్టేష‌న్ ను విజిట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా దిషా కేసు డేటా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.అందుకు మ‌ల్వానీ కేసు ద‌ర్యాప్తు చేస్తున్న అధికారి డేటా ఇచ్చేందుకు సిద్ధ‌మయ్యారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు ఫోన్ కాల్ రావ‌డంతో క‌థ అడ్డం తిరిగింది.డేటా ఇస్తాన‌న్న అధికారి నిమిషాల్లో మాట మార్చి దిషా సాలియన్ కేసు ద‌ర్యాప్తు డేటా డిలీట్ అయ్యింద‌ని చెప్పారు.

అయితే తాము డిలీట్ అయిన డేటాను రీక‌లెక్ట్ చేస్తామ‌ని బీహార్ పోలీసులు స‌ద‌రు ముంబై పోలీసు అధికారి చెప్ప‌గా కంప్యూట‌ర్ యాక్స్ స్ ఇచ్చేందుకు అనుమ‌తి లేద‌ని చెప్పారు.

ఇదిలా వుండ‌గా బీహార్ పోలీసులు దిషా సాలియ‌న్ కుటుంబ‌స‌భ్యుల వాంగ్మూలం తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఇంట్లో ఎవ‌రు లేర‌ని పోలీసులు తెలిపారు.

మ‌హ‌రాష్ట్ర పోలీసుల సహకారం లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తుకు నాయకత్వం వ‌హిస్తున్న పాట్నా ఎస్పీ వినయ్ తివారీ ముంబైకి బయలుదేరారు.

మరి ముంబై పోలీసులు అతనికి ఎంత వరకు సహకరిస్తారు అనేది ఇప్పుడు వేచి చూడాలి.

వైరల్ వీడియో: కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పక్కనే ఉండి..?