వైరల్ వీడియో: కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

మనం రోడ్డుపై ప్రయాణం చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి.ఒక్కోసారి కొందరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నా కానీ.

కొన్ని అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం.

అచ్చం అలాంటి సంఘటనని ఒకటి మహారాష్ట్రలో( Maharashtra ) చోటుచేసుకుంది.మహారాష్ట్రలోని నాగపూర్ లో ఆడి కార్లో( Audi Car ) వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీ కొట్టి వెళ్లిపోయారు.

ఆ కారు ఎవరిదన్న విచారణ చేపడితే.మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన చంద్రశేఖర్ బవాన్‌కులే( Chandrashekhar Bawankule ) కుమారుడు సంకేత్ బవాన్‌ అని తేలింది.

నాగపూర్ నగరంలో రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ సంఘటన జరిగినట్లు అక్కడి పోలీస్ అధికారులు తెలియజేశారు.

"""/" / ఆడి కార్ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అనంతరం పోలో కారు, మోపెడ్‌ ను ఢీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఈ సంఘటనలో భాగంగా ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలియజేశారు.ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.

ఈ కేసులో బవాన్‌కులేతో పాటు మరో ముగ్గురు కారు రైడర్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా గాయపడిన జితేంద్ర స్వామి( Jitendra Swamy ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలో కారు డ్రైవర్లు హవారే, చింతన్‌వార్‌ లను ఆపి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, మరో ముగ్గురు పారిపోయారని అతను తెలియచేసాడు.

"""/" / సోన్‌ కాంబ్లే ఫిర్యాదు మేరకు పోలీసులు ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు ఇతర నేరాల కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి హౌరే, చింతన్‌వార్‌ లు బెయిల్‌ పై బయటికి వచ్చారు.

ఈ సంఘటనపై మహారాష్ట్ర బీజేపీ( Maharashtra BJP ) మాట్లాడుతూ.ఆ కారు నా కొడుకు పేరు మీదనే ఉంది.

ఈ ప్రమాదంపై పోలీసులు నిష్పక్షపాతంగా, పూర్తి విచారణ జరపాలి.ఎవరిపైనా వివక్ష చూపకూడదు.

దోషులుగా ఉన్న వారిపై కేసులు పెట్టాలి అంటూ తెలిపారు.ఏది ఏమైనా కానీ ఇలా పెద్ద వారి ఇంవోల్వ్మెంట్ తో సాధారణా ప్రజలు బలవుతున్నారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బంగాళదుంప తొక్కలు పారేస్తున్నారా.. వాటితో ఇలా చేస్తే మీ జుట్టు డబుల్ అవుతుంది!