Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ మంత్రి.. రోజు చేపలు తింటే అలా అవుతారంటూ?
TeluguStop.com
బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె బాలీవుడ్ లో ( Bollywood ) ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ టాప్ హీరోల నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటింస్తోంది.ఈమె బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ వచ్చింది పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
"""/" /
కాగా వయసు పెరుగుతున్న కూడా ఈమె అందం ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇంకా చెప్పాలంటే వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాయ్ కళ్ళపై ఒక బీజేపీ మంత్రి( BJP Minister ) షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ వివరాల్లోకి వెళితే.గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే( Eknath Shinde ) ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
రెండు రోజుల క్రితం షిండే వర్గానికి చెందిన భరత్ గోగవ్లే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా వచ్చాయో వెల్లడించి షిండే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడు.
ఇప్పుడు గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి డా.విజయ్ కుమార్ గవిత్( Vijaykumar Gavit ) ఒక ప్రకటన చేసి మరో వివాదంలో ఇరుక్కున్నారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎక్కువగా చేపలు( Fish ) తింటారని, అందుకే ఆమె కళ్లు, స్కిన్ టోన్ ఎంతో అందంగా ఉంటాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
"""/" /
మీరు ఐశ్వర్యరాయ్‌ని చూశారా? ఆమె కళ్లూ ఎంతో అందంగా ఉంటాయి.
దీనికి కారణం చేపలే.ఐశ్వర్య కర్ణాటకలోని మంగళూరు తీర ప్రాంతంలో పుట్టి పెరిగింది.
రోజూ చేపలు తినడం వల్లే ఆమె కళ్లు చాలా అందంగా మెరిసిపోతున్నాయి.చేపలు తినడం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.
స్త్రీలు నాజుకుగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.చేపలలో లభించే నూనె వల్ల ఇది సాధ్యమవుతుంది.
ఐశ్వర్యారాయ్ లా మీరు రోజూ చేపలు తినండి.మీ కళ్లు, చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి అంటూ అని విజయ్ కుమార్ గావిట్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు మహారాష్ట్ర మంత్రి.
కాగా ఐశ్వర్యరాయ్ పై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ అవ్వడంతో ఐశ్వర్యారాయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కన్నీళ్లు పెట్టించే ఘటన.. కారు కింద నలిగిన లేగదూడ.. వెంబడించిన ఆవులు?