సావిత్రికి ఉన్న రెండే రెండు బలహీనతలు.. అవేంటో తెలిస్తే..?

సావిత్రి( Savitri ) ఈ పదం వింటే చాలు మనకు దేవదాసు ప్రియురాలు పార్వతి, మాయాబజార్ లోని శశిరేఖ పాత్రలే గుర్తుకు వస్తాయి.

సావిత్రి ఎన్నో మంచి పాత్రలో గొప్పగా నటించి మహానటిగా( Mahanati ) పేరు తెచ్చుకున్నారు.

1950-60 కాలంలో ఇండియాలోని హైయ్యెస్ట్ పెయిడ్, మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఒకరిగా సావిత్రి ఓ వెలుగు వెలిగారు.

ఆమె మనసు చాలా మంచిది.పైగా గొప్పగా నటించేది.

అందువల్ల సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సావిత్రికి చాలా మర్యాద ఇచ్చేవారు.సావిత్రి వెండితెరపై మంచి నటిగా నిజ జీవితంలో మనసున్న మహారాణి లాగా పేరు తెచ్చుకున్నారు.

అయితే ఇంత గొప్ప నటికి రెండు బలహీనతలు మాత్రం ఉండేవి.వాటిని ఆమె అధిగమించలేకపోయారు.

మరి ఆ రెండు వీక్నెస్‌లు ఏవో తెలుసుకుందాం.మహానటి సావిత్రికి చాలామందికి తెలియని రెండు బలహీనతలు ఉండేవి.

అదేంటంటే ఆమెకు నిద్ర( Sleep ) ముంచుకు వస్తుందంటే ఎక్కడుంటే అక్కడ ఆదమరిచి నిద్రపోయేవారు.

అలాగే తిండి విషయంలో ఎలాంటి నియమాలు పాటించేవారు కాదు.ఆహారం( Food ) మంచి రుచికరంగా ఉంటే కడుపునిండా తినేసేవారు.

ఇప్పటి హీరోయిన్ల వలె ఏ రోజూ ఆమె డైటింగ్ చేసిన సందర్భాలు లేవు.

"""/" / రొమాంటిక్ ఫిలిం దేవదాసు (1953)( Devadasu ) సినిమాతోనే సావిత్రి చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను నైట్ టైమ్‌లో జరిపేవారు.మిగతా యాక్టర్లు సన్నివేశాలు పూర్తి అయ్యేటప్పుడు సావిత్రి కుర్చీలో కూర్చునేవారు.

అయితే అది నైట్ టైమ్‌ కాబట్టి ఆమెకు బాగా నిద్ర వచ్చేది.అందువల్ల కుర్చీలో కూర్చొని అలాగే కునుకు తీసేవారు.

అక్కినేని నాగేశ్వరరావుకు( Akkineni Nageswara Rao ) ఇది నచ్చకపోయేది.ఎందుకంటే క్లోజప్ షాట్స్ తీసేటప్పుడు నిద్ర పోయిన మొహం ఉబ్బరంగా కనిపిస్తుంది.

"""/" / "ఇదిగో అమ్మాయి నువ్వు ఇప్పుడు నిద్రపోతే క్లోజప్‌ షాట్స్ తీసేటప్పుడు ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంది.

పడుకోకు" అని సావిత్రికి అక్కినేని నాగేశ్వరరావు చెప్పేవారు.కొన్నిసార్లు సావిత్రి పగలు కూడా నిద్రపోయేవారు.

అప్పుడు కూడా "ఇదిగో అమ్మాయి నువ్వు పగటిపూట నిద్రపోతే లావు ఎక్కుతావు, నిద్రపోకు" అని ఏఎన్ఆర్ మహానటికి చెప్పేవారు.

దీంతో సావిత్రికి బాగా కోపం వచ్చేది."పగులు వద్దంటారు, రాత్రి వద్దంటారు.

మరి ఎప్పుడు నిద్ర పోవాలి స్వామి." అంటూ సరదాగా చిరు కోపం చూపించేవారు.

అయితే ఈ సినిమా అయిపోయిన తర్వాత నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు నిద్రపోదువు గాని అంటూ అక్కినేని నవ్వుతూ బదులిచ్చేవారు.

అప్పట్లో వీరిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.నాగేశ్వరరావు పర్సనల్ లైఫ్ లో సుఖంగా బతికారు కానీ సావిత్రి జెమినీ గణేషన్‌ని పెళ్లి చేసుకొని బతుకు నరకం చేసుకున్నారు.

47 ఏళ్లలోనే ఆమె కన్నుమూశారు.

ఆ హీరోలపై షాకింగ్ కామెంట్లు చేసిన సినీ సెలబ్రిటీస్.. ఎవరంటే..?