Mahanati Savitri : ఆ ఒక్క ఘటనతో తన గొప్పతనాన్ని చాటుకున్న మహానటి సావిత్రి…

ఈ రోజుల్లో సినీ నిర్మాతలు లాభాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాని ఒక వ్యాపారంగా చూస్తున్నారు.

కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు.అప్పటి నిర్మాతలు ప్రజలకు ఉపయోగపడే మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఉండేవారు.

దీనివల్ల ప్రొడ్యూసర్లు డబ్బు సమస్యలతో ఇబ్బందులు కూడా పడేవారు.ఇక అప్పటి నటీనటులు కూడా డబ్బుల కోసం వెంపర్లాడే వారు కాదు.

సినిమా మంచిగా ఆడితే అదే పదివేలు అనుకునేవారు.నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కూడా కాదు.

నిర్మాత ఆర్థికంగా నష్టపోకుంటే చాలు అనుకునేవారు.1972లో వచ్చిన ‘కన్నతల్లి’( Kannathalli ) సినిమాలోని నటీనటులు కూడా సేమ్ అలాగే చేశారు.

ఈ సినిమాలో శోభన్ బాబు, సావిత్రి, చంద్రకళ, నాగభూషణం, రాజబాబు తదితరులు నటించారు.

డి.వివేకానంద రెడ్డి, రుద్రరాజు సీతారామ రాజు కలిసి నిర్మించిన ఈ సినిమాకి టి.

మాధవరావు దర్శకత్వం వహించారు.ఈ మూవీ షూటింగ్ టైంలో మహానటి సావిత్రి( Mahanati Savitri ) ఆరోగ్య సమస్యలను ఫేస్ చేసింది.

"""/"/ అనారోగ్యం తీవ్రంగా ఉండటంతో ఆమె షూటింగ్‌లో పాల్గొనలేకపోయింది.మెయిన్ హీరోయిన్ ఆమే కాబట్టి 15 రోజుల మేజర్ షెడ్యూల్ కు బ్రేక్ పడింది.

అదే షెడ్యూల్‌లో మిగతా ఆర్టిస్టులో సీన్లు కూడా ఉన్నాయి.వారు కూడా సావిత్రి రాకపోవడం వల్ల తమ పార్ట్‌ షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయారు.

కొద్దిరోజుల తర్వాత సావిత్రి తన అనారోగ్యం( Savitri Health ) నుంచి కోలుకుంది.

నిర్మాత సీతారామరాజుని కలిసి తన పరిస్థితి గురించి వెల్లడించింది.తనతో పాటు సన్నివేశాలు చేయాల్సిన మిగతా ఆర్టిస్టులను పిలిపించాలని కోరింది.

ఈ సినిమాలోని హీరో శోభన్ బాబు( Hero Shobhan Babu ) కూడా తన ఇతర సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకొని సావిత్రితో కలిసి నటించడానికి ఓకే చెప్పాడు.

ఎవరికీ సమయం వృధా కాకుండా వారం రోజుల్లోనే తన సన్నివేశాన్ని కంప్లీట్ చేస్తానని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సావిత్రి నిర్మాతను కోరింది.

దాంతో వారు అలాగే సినిమా ప్లాన్ చేసి షెడ్యూల్ కంప్లీట్ చేశారు. """/"/ అయితే సావిత్రికి నిర్మాత అప్పటికే రూ.

30,000 రెమ్యూనరేషన్ గా ఇచ్చాడు ఇంకొక రూ.10 వేల బ్యాలెన్స్ ఉంది.

అది డబ్బింగ్ చెప్పాక ఇస్తానని మాట ఇచ్చాడు.అయితే నిర్మాత తన వల్ల ఇబ్బంది పడ్డాడని గ్రహించిన సావిత్రి ఆ పదివేలు అవసరం లేదని చెబుతూ ఉచితంగానే డబ్బింగ్ చెప్పింది.

ఆ సంఘటనతో ఆమెది ఎంత పెద్ద గొప్ప మనస్సో అర్థం అయింది.శోభన్ బాబు కూడా నిర్మాత డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగి మరీ తెలుసుకున్నాడు.

ఆ తర్వాతనే డబ్బులు తీసుకున్నాడు.

రెండు వాషుల్లో చుండ్రు మొత్తం పోవాలా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!