చండీ యాగం చేసిన మహాలక్ష్మి రవీంద్ర దంపతులు… ఫోటోలు వైరల్!

తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి, ప్రొడ్యూసర్ రవీంద్ర జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రవీంద్ర సీరియల్ నటి మహాలక్ష్మిని ( Mahalakshmi) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా వీరి పెళ్లి జరిగిన రోజు నుంచి ఈ దంపతులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు.

అధిక శరీర కాయం కలిగి ఉన్నటువంటి రవీంద్రనను కుందనపు బొమ్మల ఉన్నటువంటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో కేవలం డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుంది అంటూ ఈ జంట పై భారీగా ట్రోల్స్ చేశారు.

"""/" / ఇక ఈ వార్తలపై రవీంద్ర మహాలక్ష్మి దంపతులు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ జంట ఎక్కడికి వెళ్ళినా తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక వీరిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి ఆరు నెలలు (Six Months) పూర్తి కావడంతో వీరి ఆరవ నెల వివాహ వార్షికోత్సవాన్ని( Wedding Celebrations) ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను రవీందర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

"""/" / ఇలా వీరి వివాహం జరిగే ఆరు నెలలు పూర్తి కావడంతో ఈ దంపతులు తమ ఇంట్లో చండీయాగం నిర్వహించారు.

ఇలా ఈ దంపతులు తమ ఇంట్లోనే ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

ఈ క్రమంలోనే రవీందర్ ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.ఇక మహాలక్ష్మి కోలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర సీరియల్స్ తో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావడం విశేషం.ఇదివరకే మహాలక్ష్మి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే అతనితో మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు ఇచ్చి ప్రొడ్యూసర్ రవీందర్ ను పెళ్లి చేసుకున్నారు.

వీడియో వైరల్: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రిస్క్ చేసి భలే పట్టేసాడుగా..