మద్యం తాగే మహిళలు అతని కంటపడ్డారో ఫినిష్ ?
TeluguStop.com
మామూలుగా దొంగతనాలు చేస్తే 'కిక్' ఉండదని భావించాడో ఏమో తెలియదు కానీ.తనకు చేసే దొంగతనాలకు ఒక నియమాన్ని కూడా పెట్టుకున్నాడు ఓ కేటుగాడు.
ఆ నియమం ప్రకారం మద్యం తాగే అలవాటు ఉన్న మహిళలనే టార్గెట్ చేసుకుంటూ, దొంగతనాలతో పాటు హత్యలు చేయడం అలవాటు చేసుకున్నఆ సీరియల్ కిల్లర్ ను ఎట్టకేలకు మహబూబ్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఇప్పటి వరకు ఆ సీరియల్ కిల్లర్ 16 మంది మహిళలను అంతమొందించాడు.వివరాల్లోకి వెళితే బాలానగర్ మండలం గుండెడ్ కు చెందిన ఎరుకల శ్రీను గతంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు.
అయినా అతగాడు తీరు మార్చుకోలేదు సరికదా తన సొంత తమ్ముని అంతం చేశాడు.
అయితే ఇటీవల ఒక మహిళను హత్య చేసిన నిందితుడు శ్రీను పోలీసులకు పట్టుబడ్డాడు.
పోలీసులు తమదైన శైలిలో అతగాడికి ట్రీట్మెంట్ ఇచ్చి నిజం రాబట్టగా కేవలం మద్యం మత్తులో ఉన్న మహిళల ఒంటిపై ఉన్న బంగారం సొమ్ములు కోసమే హత్యకు పాల్పడ్డారని షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ఇప్పటికే అనేకసార్లు శ్రీను జైలుకు వెళ్లి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
అయితే ఇటీవల ఓ మహిళ హత్య కేసుకు సంబంధించి పోలీసులకు చిక్కాడు.దేవరకద్ర మండలం డోకూరు శివార్లలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం పై పోలీసులు ఆరా తీయగా అందులో శ్రీను పాత్ర ఉన్నట్టు ఆధారాలు లభించాయి.
2018 నుంచి ఇప్పటివరకు నిందితుడు శ్రీనివాస్ 18 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు వీటిలో 17 హత్య కేసులు కాగా మరొకటి కస్టడీ నుంచి పారిపోయిన కేసు.
ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ సీరం ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!