మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు
TeluguStop.com
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ సమ్మేళనంగా అభివర్ణించే మహా కుంభమేళా 2025కు( MahaKumbhMela2025 ) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కుంభ మేళాను నిర్వహించనున్నాయి.
ఈసారి దాదాపు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని అంచనా.
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుంది.
స్వదేశీ భక్తులు సహా ఎన్ఆర్ఐ భక్తులు, విదేశీ పర్యాటకులు ( NRI Devotees , Foreign Tourists )మరపురాని అనుభూతిని పొందేలా డబుల్ ఇంజిన్ ప్రభుత్వ మద్ధతుతో ప్రపంచస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అతుకులు లేని ప్రయాణం, కనెక్టివిటీ, వసతి, భోజన సౌకర్యాల వరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా యోగి సర్కార్ చర్యలు తీసుకుంటోంది.
"""/" /
ఎన్ఆర్ఐల( NRIs ) కోసం ప్రత్యేకంగా పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎన్ఆర్ఐలు, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక స్వాగత కేంద్రాలు, బహుభాషా సాయం, ట్రావెల్ గైడ్‌లు, స్థానిక సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
ఆన్‌లైన్ బుకింగ్, రిజిస్ట్రేషన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనే వసతి, తీర్ధయాత్ర ప్యాకేజీ, ఇతర సేవలను అందించడానికి ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేశారు.
"""/" /
4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కుంభమేళా ప్రాంతాన్ని 25 సెక్టార్లుగా విభజించి 12 కి.
మీ పొడవైన ఘాట్‌లు, 67 వేల స్ట్రీట్ లైట్స్, లక్షా 50 వేల మరుగుదొడ్లు, లక్షా 50 వేల టెంట్లు, 25 వేలకు పైగా వసతి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎంత మంది భక్తులు ఈ కుంభమేళాకు హాజరయ్యారో తెలుసుకునేందుకు గాను ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు.
ముఖ్యమైన పర్వదినాలలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ఈ ఆహారాలు ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం.. తెలుసా?