చ‌వితి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి

హైద‌రాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు గాంచిన ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌య్యాడు.

ఈ క్ర‌మంలో బొజ్జ గ‌ణ‌ప‌య్య ద‌ర్శ‌నానికి భ‌క్తులు బారులు తీరుతున్నారు.కాగా, ఈ సంవ‌త్స‌రం గ‌ణ‌ప‌య్య 50 అడుగుల ఎత్తులో ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

శ్రీ పంచ‌ముఖ మ‌హాల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి రూపంలో క‌నువిందు చేస్తున్నాడు.ఈ గ‌ణ‌ప‌య్య‌కు కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, ఎడ‌మ వైపున శ్రీ త్రిశ‌క్తి మ‌హా గాయత్రీ దేవి కొలువు దీరారు.

అయితే, ఖైర‌తాబాద్ లో తొలిసారి మ‌ట్టి విగ్ర‌హాన్ని త‌యారు చేశారు.

ముంబైలో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడిన రిషి సునాక్ .. ఇంటర్నెట్ షేక్