నిద్ర ప‌ట్ట‌డానికి మందులు వాడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకే!

ప్ర‌స్తుత రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని మ‌ద‌న పెడుతున్న స‌మ‌స్య నిద్ర‌లేమి.

ఇది చిన్న స‌మ‌స్య‌గానే క‌నిపించినా నిర్ల‌క్ష్యం చేస్తే.ప్రాణాంత‌కంగా మారుతుంది.

అందుకే చాలా మంది నిద్ర ప‌ట్ట‌డానికి మందులు వాడుతుంటారు.కానీ, స్లీపింగ్ పిల్స్ తాత్కాలిక పరిష్కారమే తప్పా.

శాశ్వత పరిష్కారం కాదు.పైగా వీటిని రెగ్యుల‌ర్‌గా వాడితే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

అందుకే మందుల‌తో కాకుండా స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లో సుఖ‌మైన నిద్ర‌ను పొందేందుకు ప్ర‌య‌త్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతాయి.

మ‌రి ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక క‌ప్పు బాదం ప‌ప్పులు వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించుకున్న బాదం ప‌ప్పులు, రెండు టేబుల్ స్పూన్ల సోంపు, రెండు యాలకులు, చిన్న ప‌టిక బెల్లం ముక్క వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక స్పూన్ చ‌ప్పున గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో క‌లిపి నిద్రించ‌డానికి గంట ముందు సేవించాలి.

ఇలా చేస్తే ఎలాంటి మందులు వాడ‌క‌పోయినా హాయిగా నిద్ర పోవ‌చ్చు.ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్నా రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌దు.

"""/"/ అందుకే నిద్ర పోవ‌డానికి అర గంట ముందు నూనెను తీసుకుని త‌ల‌కు, పాదాల‌కు ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే ఒత్తిడి దూర‌మై మెద‌డు, మ‌న‌సు ప్ర‌శాంతంగా మార‌తాయి.దాంతో సుఖంగా నిద్ర‌పోతారు.

అలాగే కొంద‌రు నిద్ర ప‌ట్ట‌డం కోసం ఆల్క‌హాల్‌ను సేవిస్తుంటారు.ఇది అతి చెత్త అల‌వాటు.

ఆల్క‌హాల్ తీసుకుంటే నిద్ర ప‌ట్ట‌డం కాదు.వ‌చ్చే నిద్ర కూడా చెడుతుంది.

కాబ‌ట్టి, నిద్ర పోవ‌డానికి ముందు ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండాలి.ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో చిటికెడు కుంకుమపువ్వు మిక్స్ చేసి తాగినా కూడా మంచి నిద్ర ప‌డుతుంది.

చిరంజీవి హరీష్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?