డ్రై స్కిన్ తో సతమతం అవుతున్నారా? అయితే ఈ మ్యాజికల్ రెమెడీ మీ కోసమే!

సాధారణంగా కొందరి చర్మం చాలా డ్రై గా ఉంటుంది.ఇలాంటి వారు ఖరీదైన మాయిశ్చరైజర్స్ ను వాడుతుంటారు.

అయితే ఎంత మంచి మాయిశ్చరైజర్ ను వాడినప్పటికీ చర్మం మళ్లీ కొన్ని గంటలకే డ్రై గా మారిపోతుంటుంది.

డ్రై స్కిన్ వల్ల ముఖంలో గ్లో తగ్గుతుంది.నిర్జీవంగా కనిపిస్తుంది.

దీంతో చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే అస్సలు చింతించకండి.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే డ్రై స్కిన్ కు బై బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ పెటల్స్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మరియు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్‌ సహాయంతో కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు చ‌ర్మాన్ని ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

"""/" / రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం డే మొత్తం తేమగా ఉంటుంది.

డ్రై స్కిన్ అన్న మాటే అనరు.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

నెయ్యి పాలు మరియు గులాబీ రేకుల పొడిలో ఉండే ప్రత్యేక సుగుణాలు చర్మాన్ని య‌వ్వ‌నంగా మారుస్తాయి.

చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే పోగొడతాయి. """/" / అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల ఓపెన్ పోర్స్ సైతం క్లోజ్ అవుతాయి.

కాబట్టి ఎవరైతే డ్రై స్కిన్ తో సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ మ్యాజిక‌ల్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

చర్మాన్ని తేమ గా అందంగా మెరిపించుకోండి.

మనసంతా నువ్వే దర్శకుడిని ఆ సంస్థ నిజంగానే తొక్కేస్తుందా?