నిత్య యవ్వనంగా మెరిసిపోవాలనుందా? అయితే ఈ మూడు చాలు!
TeluguStop.com
నిత్య యవ్వనంగా మెరిసిపోవాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.దాదాపు అందరూ అదే కోరుకుంటారు.
అందులోనూ స్త్రీలు ఇంకాస్త ఎక్కువగా కోరుకుంటారు.కానీ.
ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజస్, పలు రకాల మందుల వాడకం, శరీరానికి శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం వంటి రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే యవ్వనం దెబ్బ తింటుంది.
ఫలితంగా ముడతలు, చర్మం సాగడం, చర్మం యొక్క నిగారింపు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
దాంతో ఆ సమస్యలను నివారించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.
? అయితే అస్సలు బాధపడకండి.ఎందుకంటే, అవిసె గింజలు, బీట్ రూట్, విటమిన్ ఇ ఆయిల్.
ఈ మూడు ఉంటే ఆయా సమస్యలను వదిలించుకుని నిత్య యవ్వనంగా మెరిసిపోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడిటిని కలిపి ఎలా చర్మానికి వాడాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే.
జెల్లీగా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న అవిసె గింజలను చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక పల్చటి వస్త్రం సాయంతో జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక కప్పు బీట్ రూట్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసి.
దాని నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ బీట్‌రూట్ జ్యూస్‌ను పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేసి చల్లారబెట్టుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజల జెల్, మూడు టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మూడు, నాలుగు రోజుల పాటు వాడుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి.
పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి.అనంతరం నీటితో శుభ్రం చేసుకోండి.
ఇలా రోజుకు ఒకసారి చేస్తే నిత్య యవ్వనంగా మెరిసిపోవడం ఖాయం.
తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?