న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను మాయం చేసే మ్యాజిక‌ల్ క్రీమ్..త‌ప్ప‌కుండా ట్రై చేయండి!

క‌ళ్ల చుట్టు న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌టానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.అతిగా నిద్ర పోవ‌డం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ఎక్కువ గంటలు మేల్కొని ఉండడం, ఒత్తిడి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తీసుకోక‌పోవ‌డం, హార్మోనల్ సమస్యలు, లైఫ్ స్టైల్, అల‌స‌ట వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల చుట్టు న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌స్తుంటాయి.

వీటిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.మార్కెట్లో లభించే క్రీములు, లోషన్స్ నుంచి.

వంటింటి చిట్కాల వరకు అన్నింటినీ ఆచ‌రిస్తూ ఉంటారు.మీరు ఆ జాబితాలో ఉన్నారా.

? న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను వ‌దిలించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా.? అయితే ఇక‌పై వ‌ర్రీ వ‌ద్దు.

ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే మ్యాజిక‌ల్ క్రీమ్‌ను ట్రై చేస్తే స‌హ‌జంగానే న‌ల్ల‌టి వ‌ల‌యాలు మాయం అవుతాయి.

మరి ఇంత‌కీ ఈ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ లుక్కేసేయండి.ముందుగా మిక్సీ జార్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ వేసి పొడి చేసుకోవాలి.

ఈ పొడిని ఒక మంద‌పాటి గిన్నెలోకి వేసుకుని.ఒక గ్లాస్ వాట‌ర్ పోసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను స్ట‌వ్ పై పెట్టి.చిన్న మంట‌పై ప‌ది నుండి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి.

చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఉడికించుకున్న మిశ్ర‌మం నుండి థిక్‌గా ఉండే జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

"""/"/ ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, మూడు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ జ్యూస్‌, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్, నాలుగు చుక్క‌లు ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ప‌ది రోజుల పాటు యూస్ చేసుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను అప్లై చేసుకుని సున్నితంగా మ‌సాజ్ చేసుకుంటే క్ర‌మంగా డార్క్ స‌ర్కిల్స్ దూరం అవుతాయి.

ధనుష్ ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది…