మామిడిపల్లిలో మొదలైన మాఘమాసం జాతర

మామిడిపల్లిలో మొదలైన మాఘమాసం జాతర

మాఘ మాసం జాతర రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి సీతారాముల సన్నిధిలో కన్నుల పండుగగా జరుగుతుందని అర్చకులు కృష్ణ తెలిపారు.

మామిడిపల్లిలో మొదలైన మాఘమాసం జాతర

ప్రతి ఒక్కరూ బాగా అమావాస్య రోజు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించి సీతారాములను దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు.

మామిడిపల్లిలో మొదలైన మాఘమాసం జాతర

ప్రతి సంవత్సరం మాఘ మాస జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని వెల్లడించారు.వేములవాడ రాజన్న ఆలయ ఈవో శ్రీ కె.

వినోద్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ముందుగా కొనరావుపేట ఎమ్మార్వో కుటుంబ సమేతంగా వచ్చి సన్నిధిలో జాతర ప్రారంభ పూజ కార్యక్రమాలను నిర్వహించారు.

అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

క్యూలైన్ల లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ఆలయ ధికారులు, ఎస్సై ప్రశాంత్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.

ఆలయ ఏఈఓ లు గుట్ట శ్రావణ్, బ్రాహ్మణ గారి శ్రీనివాస్, డి ఈ మైపాల్ రెడ్డి, ఏ ఈ రామకృష్ణారావు, ఆలయ పర్యవేక్షకులు వెంకటప్రసాద్, ఇన్స్పెక్టర్ నూగురి నరేందర్, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి20, గురువారం2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి20, గురువారం2025