మాస్ట్రో చెయ్యాలంటే భయం వేసింది.. నితిన్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, తమన్నా, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం "మాస్ట్రో".

ఈ చిత్రం హిందీలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ‘అందాధున్‌’ కి రీమేక్ గా తెరకెక్కించారు.

షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్న ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.

ఈవెంట్ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.మొదటిసారి మాస్ట్రో సినిమా చేయాలంటే చాలా భయం వేసిందని, ఇలాంటి సమయంలో ఈ విధమైనటువంటి సినిమాలు చేయడం అవసరమా.

అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకని మొదట్లో భావించాను.కానీ ఒక నటుడిగా రిస్కు తీసుకోవాలని భావించి ఈ సినిమాలో నటించానని తెలియజేశారు.

ఈ సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు మేర్లపాక గాంధీ ఎంతో కష్టపడ్డారని రీమేక్ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదని ఈ సందర్భంగా నితిన్ మాట్లాడారు.

ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ లోనే విడుదల కావాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.

ఇక ఈ వేడుకల్లో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ.నితిన్ హీరోగా ఒక కమర్షియల్ చిత్రాన్ని చేయాలని భావించాను కానీ మాస్ట్రో కుదిరింది.

"""/"/ ఈ చిత్రం చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఇందులో తమన్నా ఎంతో అద్భుతంగా నటించారని దర్శకుడు మాట్లాడారు.

ఇక మిల్క్ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ.ఎన్నో రోజుల తర్వాత ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది.

నితిన్ తో కలిసి ప్రేమకథ సినిమాలో నటిస్తానేమో అనుకున్నాను కానీ ఇలా మాస్ట్రో కథ కుదిరింది.

"""/"/ సినిమా చాలా అద్భుతంగా ఉందని ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా తమన్నా తెలియజేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ,టీజర్లు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

మరి సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే సీరం తయారు చేసుకోండిలా!!