మురుగదాస్ పై కేసు కొట్టేసిన చెన్నై హైకోర్ట్..!

సర్కార్ సినిమాలో ప్రభుత్వ పథకాలను తప్పుగా చూపించారని దర్శకుడు మురుగదాస్ మీద అన్నాడిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ లో అన్నాడిఎంకే కార్యకర్త డేవరాజన్ అనే వ్యక్తి మురుగదాస్ పై ఫిర్యాదు కూడాచేశాడు.

అతని ఫిర్యాదుతో సీసీసీబీ పోలీసులు మురుగదాస్ పై కేసు నమోదు చేశారు.2018లో రిలీజైన సర్కార్ సినిమాలో ప్రభుత్వ పథకాల మీద విమర్శిస్తూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి.

వాటిపై మురుగదాస్ పై అన్నాడిఎంకే నేతలు కేసు వేశారు.అయితే ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందుగానే మద్రాస్ హైకోర్ట్ నుండి మురుగదాస్ ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు.

కేసును కొట్టేయాలంటూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు.కేసు విచారించిన హైకోర్ట్ సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాతే సినిమా రిలీజైందని.

సెన్సార్ అయిన తర్వాత ఒక వ్యక్తి కాని.ప్రభుత్వం కాని కేసు పెట్టడం లేరని చెప్పింది.

ఈ పిటీష ను రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని వివరణ ఇచ్చి పిటీషన్ ను కొట్టివేస్తున్నట్టు చెప్పింది.

 ఈ కేసు నుండి మురుగదాస్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.కొన్నాళ్లుగా ఈ కేసు విషయమై మురుగదాస్ కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు..అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశం