మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర పోస్టర్ ను మహజన సోషలిస్ట్ పార్టీ, మాదిగరిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన మందకృష్ణ మాదిగ చేపట్టే ఛలో అలంపూర్ - టూ హైదరాబాద్ మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర ను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో ఆవునూరి ప్రభాకర్ మాదిగ, మహజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఇంచార్జి, ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, మహజన సోషలిస్ట్ పార్టీ కో ఆర్డినేటర్, తంగళ్లపల్లి దేవరాజు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి, చిట్యాల మధు మాదిగ బాహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నేదూరి బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు,అవునూరి విజయేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు, పసుల కమలాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు, ఆవునూరి లచ్చన్నా మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు, సమానపల్లి రాకేష్ మాదిగ అంబేద్కర్ సంఘo రాష్ట్ర కార్యదర్శి,శ్రావణపల్లి మల్లేశం మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?