రూ.20 వేలతో కొన్న బైక్‌కు రూ.60 వేలతో బరాత్.. చివరకు షాకిచ్చిన పోలీసులు..
TeluguStop.com
మనలో చాలామంది దసరా పండుగ( Dasara Festival ) సందర్భంగా .కొత్త మొబైల్ ఫోన్స్, కొత్త వాహనాలు వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
పండగ పూట ప్రతి ఒక్కరు కూడా వాహనాలకు పూజలు నిర్వహించడం సర్వసాధారణం.అయితే, తాజాగా ఒక వ్యక్తి తాను కొత్తగా కొనుగోలు చేసిన బైకు భారీ ఊరేగింపు నిర్వహించి చివరికి చిక్కులలో పడ్డాడు.
మొత్తానికి రూ.90,000 విలువ చేసే మొపెడ్ వాహనాన్ని 20 వేలకే డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేసాడు వ్యక్తి.
అయితే., ఇంత తక్కువకు తీసుకోవడంతో అతడు ఊరంతా చెప్పుకునేలాగా గొప్పగా సంబరాలు నిర్వహించాడు.
"""/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్ లోని( Madhya Pradesh ) శివపూర్ లో టీ స్టాల్ నడుపుతున్న ఒక వ్యక్తి మొపెడ్ కొనుగోలు చేశాడు.
వాసవానికి ఈ బండి ధర 90 వేల రూపాయలు కాగ అతడు బ్యాంకు లోన్ తీసుకొని 20వేల రూపాయల డౌన్ పేమెంట్ చేసి బైక్ ను కొనుగోలు చేశాడు.
ఈ తరుణంలో కొత్త బండిని( New Bike ) తన ఇంటికి తీసుకొని వచ్చే క్రమంలో భారీగా బ్యాండ్ బాజా ఏర్పాటు చేసి ఆ బైకుకు ఊరేగింపు నిర్వహించాడు.
ఈ ఊరేగింపులో భాగంగా డీజే పాటలు, బండిని ప్రదర్శించడం.తాను కొత్తగా కొన్న బండిని క్రేన్ కు కట్టి శోభయాత్ర నిర్వహించాడు.
"""/" /
అయితే., ఇలా శోభాయాత్రలో పెద్ద ఎత్తున డీజే సౌండ్స్( DJ ) పెట్టేందుకు అనుమతి లేకపోవడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు రంగంలోకి దిగగా ఒక్కసారిగా పండగ వాతావరణం కాస్త రివర్స్ అయ్యింది.పోలీసులు అనుమతి లేకుండా డీజే పెట్టడంతో ఆ బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
అలాగే., డీజే నిర్వహించిన బండిని కూడా సీజ్ చేశారు.
ఇక ఈ వీడియోని చూసిన కొంత మందిని నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కూతురితో ఘనంగా క్రిస్మస్ జరుపుకున్న చరణ్ ఉపాసన…ఫోటోలు వైరల్!