టీవీ9 కి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన మాధవిలత

బాలీవుడ్‌ స్టార్స్‌ లో 90 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌ పూర్తి వివరాలు బయటకు లాగాలంటూ డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే.

ఇదే సమయంలో టాలీవుడ్‌ నటి, బీజేపీ నాయకురాలు మాధవిలత కూడా డ్రగ్స్‌ విషయంలో స్పందించింది.

టాలీవుడ్‌ ప్రముఖుల పార్టీల్లో డ్రగ్స్‌ అనేవి చాలా కామన్‌ అంటూ పేర్కొంది.డ్రగ్స్‌ లేని టాలీవుడ్‌ ను కోరుకుంటున్నట్లుగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.

ఆ విషయమై ఎక్సైజ్‌ శాఖ వారు మాధవిలతకు కౌంటర్‌ ఇచ్చారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదంటూ సూచించారంటూ టీవీ9 ఒక కథనంలో పేర్కొంది.

టీవీ9 కథనంపై మాధవిలత సీరియస్‌ అయ్యింది.తాను ఒక బాధ్యత గల పౌరురాలిగా, బీజేపీ నాయకురాలిగా, టాలీవుడ్‌ మంచి కోరుకునే వ్యక్తిగా డ్రగ్స్‌ రహిత సమాజం కోరుకుంటూ నేను ఆ పోస్ట్‌ పెట్టాను.

దానికి నేను సాక్ష్యాధారాలు చూపించాల్సిన అవసరం లేదు.డ్రగ్స్‌ వారు తీసుకుంటున్నారు వీరు తీసుకుంటున్నారు అంటూ నేను ఎప్పుడు చెప్పలేదు.

నా పోస్ట్‌ లో ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్థావించలేదు.అయినా కూడా నన్ను ఎక్సైజ్‌ వారు హెచ్చరించారు నేను కొందరిపై అనవసర ఆరోపణలు చేశానంటూ వారు నాకు కౌంటర్‌ ఇచ్చారంటూ టీవీ9 లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందంటూ రాత్రి పొద్దు పోయాక మాధవిలత ఫేస్‌ బుక్‌ లైవ్‌ లో పేర్కొంది.

"""/"/ ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.అసలు ఇప్పటి వరకు ఎక్సైజ్‌ శాఖ వారు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వడం కాని కాంటాక్ట్‌ అవ్వడానికి కాని ప్రయత్నించలేదు.

అయినా వారికి వారే ఊహించుకుని ఇలా ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని తాను డ్రగ్స్ రహిత భారత్‌ పిలుపు ఇచ్చిన మోడీగారిని ఆదర్శంగా తీసుకుని ఆ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చింది.

అమరావతికి స్పెషల్ గ్రాంట్ ?  బాబు ప్రతిపాదన సక్సెస్ అవుతుందా ?