రష్మిక వేసుకునే డ్రెస్సుల కంటే అందులో ఘోరంగా లేదు.. మాధవీలత షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్( Tollywood ) ప్రముఖ నటి మాధవీలత( Madhavilatha ) సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.
రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ కాగా చాలామంది సెలబ్రిటీలు రష్మికకు మద్దతు ప్రకటించారు.
అయితే మాధవీలత మాత్రం రష్మిక వేసుకునే డ్రెస్సుల కంటే అందులో ఘోరంగా లేదు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.
మాధవీలత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.మాధవీలత రష్మిక గురించి ఒకింత బోల్డ్ గా కామెంట్లు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మాధవీలత ఇన్ స్టాగ్రామ్( Instagram ) పోస్ట్ లో ఈ ఫోటో చూశారు కదా.
రష్మిక ముఖాన్ని వేరే అమ్మాయి శరీరానికి అటాచ్ చేశారని అన్నారు.కాకపోతే అందులో పెద్ద అసహ్యంగా ఏమీ లేదని మాధవీలత కామెంట్లు చేయడం గమనార్హం.
రష్మిక ఈవెంట్లలో, సినిమాలలో వేసుకునే డ్రెస్ ల కంటే అందులో ఘోరంగా లేదని ఆమె తెలిపారు.
"""/" /
రష్మిక రియాలిటీకి ఆ వీడియోకు కొన్ని తేడాలు ఉన్నాయని మాధవీలత చెప్పుకొచ్చారు.
స్టార్ హీరోయిన్లు ఒక ఇష్యూను రైజ్ చేస్తే ఆ ఇష్యూ సొసైటీలో పెద్ద సమస్య అవుతుందని ఆమె అన్నారు.
తాజాగా జర్నలిస్ట్ అసోసియేషన్( Journalist Association ) కూడా రష్మికకు మద్దతు ప్రకటించిందని మాధవీలత పేర్కొన్నారు.
జర్నలిస్టులు రష్మికకు సపోర్ట్ గా ఉండటం కాదని బయట ఉన్న ఆడపిల్లల సేఫ్టీకి మీరు సహకారం అందించాలని ఆమె చెప్పుకొచ్చారు.
"""/" /
అవేర్ నెస్ ప్రోగ్రామ్ లను నేటి తరం యువతులకు అందిస్తే జర్నలిజానికి విలువ ఉంటుందని మాధవీలత వెల్లడించారు.
ఈ హీరోయిన్లు సావిత్రి, సాయిపల్లవి, మాధవీలతలా మడిగట్టుకుని కూర్చునే హీరోయిన్లు కాదని ఆమె వెల్లడించారు.
రష్మిక ఒరిజినల్ డ్రెస్ ల కంటే ఆ అమ్మాయి పెద్ద డ్రెస్ ఏం వేసుకోలేదని మాధవీలత కామెంట్లు చేశారు.
ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…