ఆ ఫోటోతో నెటిజన్స్ ను కంటతడి పెట్టించిన మాధవిలత.. అసలు విషయం ఏంటంటే?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు అప్పుడప్పుడు కొన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు.ఇక సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో.
వాళ్ళు ఏది పంచుకున్న కూడా క్షణాల్లో అందరికీ తెలిసిపోతూ ఉంటుంది.అయితే తాజాగా నటి మాధవి లత ఒక ఫోటో పంచుకోగా ఆ ఫోటో చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు.
ఇంతకు ఆ ఫోటోలో ఎవరున్నారు.ఇంతకు ఆమె ఎవరి ఫోటో పంచుకుంది.
అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తెలుగు నటి మాధవి లత.
ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.
ఈమె చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై నటిగా అడుగుపెట్టింది.ఆ తర్వాత తన నటనకు మంచి మార్కులు రావడంతో హీరోయిన్ గా పరిచయం అయింది.
అలా 2008 లో నచ్చావులే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ.
ఇక తన అందం పరంగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఆ తర్వాత స్నేహితుడు సినిమాలో కూడా నటించింది.
కానీ ఎందుకో తను ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.పైగా తాను కథ ఎంచుకోవడంలో పొరపాటు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
"""/"/
అలా ఎంతో కాలం అవకాశాల కోసం బాగా ఎదురు చూసింది.కానీ కొత్త హీరోయిన్ లు అడుగుపెట్టడంతో ఈమెకు అవకాశాలు అనేది లేకపోయాయి.
పైగా తెలుగు అమ్మాయి కాబట్టి ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశారు.అయినప్పటికీ కూడా అవకాశాల కోసం బాగా ప్రయత్నిస్తుంది.
ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.
"""/"/
రాజకీయపరంగా కూడా యాక్టివ్ గా ఉంది ఈమె.ఇక నిత్యం తన సోషల్ మీడియా వేదికగా ఏదో విషయం తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.
కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.పైగా తాను కూడా అవతలి వారి పై బాగా ఫైర్ అవుతుంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.
"""/"/
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో పంచుకుంది.
ఆ ఫోటోలో తనతో పాటు ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా అందరి మది దోచుకున్న నటుడు ఉదయ్ కిరణ్ కూడా ఉన్నాడు.
దీంతో ఆమె ఆ ఫోటో షేర్ చేసుకోవడంతో ఆయన అభిమానులు చాలా ఎమోషనల్ అయ్యారు.
చాలా రోజులకు మంచి ఫోటో పెట్టావు అని.మళ్లీ ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకునేలా చేశావు అంటూ మాధవిలతకు థాంక్స్ చెప్పుకుంటున్నారు.
ఇక గతంలో ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ ను ఇప్పటికి ఆయన అభిమానులు మరువలేక పోతున్నారు.