మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత.. ఆమెకు న్యాయం జరుగుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మాధవీలత( Madhavilatha ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నటిగా, రాజకీయ నేతగా మాధవీలత పాపులారిటీని సంపాదించుకున్నారు.అయితే కొన్నిరోజుల క్రితం మాధవీలత గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే ఆయన ఆ కామెంట్ల విషయంలో వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్పడం జరిగింది.

అయితే మాధవీలత మాత్రం ఆయన క్షమాపణలతో సంతృప్తి చెందలేదు.ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( Movie Artist Association ) ను సంప్రదించడం గమనార్హం.

హ్యూమన్ రైట్స్ కమిషన్ తో పాటు పోలీసులను సైతం సంప్రదించినట్టు ఆమె వెల్లడించారు.

తన గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుగా కామెంట్లు చేసినా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ రియాక్ట్ కాలేదని మాధవీలత పేర్కొన్నారు.

"""/" / శివబాలాజీ ( Shiva Balaji )గారు ఈ ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారని మాధవీలత పేర్కొన్నారు.

సినిమా వాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని ఆమె చెప్పుకొచ్చారు.రాజకీయ నాయకులు ప్రజా సమస్యల విషయంలో దృష్టి పెట్టాలని ఆమె కోరారు.

మాధవీలత ఫిర్యాదు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. """/" / మాధవీలత పొలిటికల్ గా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమాల విషయంలో ఆమె అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.మాధవీలతకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

మాధవీలతను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.మాధవీలత పరిమితంగా సినిమాలు చేసినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

సినిమాల్లోకి మాధవీలత రీఎంట్రీ ఇస్తే ఆమె ఖాతాలో మరిన్ని సంచలన విజయాలు చేరతాయని చెప్పవచ్చు.

మాధవీలత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన అబ్బాయి.. ఈ అబ్బాయి ఎవరంటే?