పోలీసులకు ఫిర్యాదు చేసిన మాధవీలత

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ మాధవీలత ఆశించిన స్థాయిలో హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేక పోయింది.

దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యింది.ఒక వైపు బీజేపీలో ఉంటూనే మరో వైపు ప్రజా సమస్యలపై సొంతంగా కూడా పోరాటం చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు తనను సోషల్‌ మీడియాలో వేదిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఆమె ఫిర్యాదును స్వయంగా స్వీకరించిన సజ్జనార్‌ చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చాడు. """/"/ ఈ సందర్బంగా మాధవీలత ఆయనతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

కొందరు వ్యక్తులు కావాలని తనను అవమాన పర్చుతూ బ్యాడ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.మరికొందరు తనను వ్యక్తిగతంగా దూషిస్తూ తనపై కామెంట్స్‌ చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

తనపై బ్యాడ్‌ కామెంట్స్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలా చేయాంటూ ఈ అమ్మడు కోరింది.

అందుకు సీపీ సజ్జనార్‌ తప్పకుండా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పాడట.

వెంకటేష్ ఈ సంక్రాంతి విన్నర్ నిలిచాడా..?