స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటుతున్న మాధవన్ కొడుకు వేధాంత్..!

ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లో, సెలబ్రిటీల పిల్లలు సినిమా రంగంలో రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

తల్లిదండ్రుల రంగంలోనే రాణించాలని పిల్లలు భావిస్తారు.అభిమానులు కూడా అదే కోరుకుంటారు.

అయితే కేవలం కొద్ది మంది మాత్రమే తల్లిదండ్రుల రంగం వైపు కాకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని అందులో రాణిస్తున్నారు.

ఆ కోవకు చెందిన వాడే హీరో మాధవన్ కొడుకు వేధాంత్(Vedaant Madhavan ).

తనకు ఇష్టమైన స్విమ్మింగ్ పోటీల్లో రాణిస్తూ బంగారు మెడల్స్ తో రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.

"""/" / తాజాగా మలేషియా( Malaysia )లో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో భారత్ తరపున పాల్గొని ఐదు బంగారు పతకాలు సాధించాడు.

50, 100, 200, 400, 1500 మీటర్ల విభాగంలో పతకాలు సాధించి తన సత్తా చాటాడు.

ఈ విషయాన్ని హీరో మాధవన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.తన కొడుకు సాధించిన విజయం పట్ల తనకు ఎంతో సంతోషం కలిగిందని, ఆ సంతోషం మాటల్లో చెప్పలేని దంటు గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది అని ట్వీట్ చేశాడు.

""img / హీరో మాధవన్ చేసిన ట్వీట్ ను చూసిన నెటిజన్స్ మాధవన్, వేధాంత్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చాలామంది సెలబ్రిటీల పిల్లలు పార్టీలు, పబ్బులంటూ తిరుగుతూ ఉంటే హీరో మాధవన్ తన కొడుకును గొప్పగా పెంచాడంటూ పొగుడుతున్నారు.

వేధాంత్ భవిష్యత్తు కాలంలో ఎన్నో మెడల్స్ సాధించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. """/" / ఇక హీరో మాధవన్ సినిమాల విషయానికి వస్తే.

తాజాగా ఏ సినిమాను ఒప్పుకున్నట్టు కనిపించడం లేదు.అయితే సినిమా రంగంలో అటు విలన్ గాను, హీరో గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

హీరో మాధవన్, వేధాంత్ ల పట్ల సోషల్ మీడియా( Social Media )లో ఎప్పుడు పాజిటివ్ వైబ్సే ఉంటాయని అందరికీ తెలిసిందే.

వైరల్ వీడియో: కొడుకు మొండితనానికి తండ్రీకొడుకులను విమానం నుంచి దించేసిన విమాన సిబ్బంది..