అజ్ఞానంతోనే అలాంటి మాటలు అన్నా.. ట్రోల్స్ పై మాధవన్ రియాక్షన్!

తమిళ తెలుగు సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

చాలా కాలంగా సినిమాకి దూరంగా ఉన్నటువంటి మాధవన్ దర్శకుడిగా మారిపోయారు.ఈ క్రమంలోనే ఆయన దర్శకుడిగా మొట్టమొదటిసారి సైంటిఫిక్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' .ఈ సినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే మాధవన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాధవన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.

అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అంగారకుడి కక్ష్యలోకి అది చేరుకునేందుకు ఇస్రోకు పంచాంగం ఎంతో సహాయపడిందని బలమైన ముహూర్తంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను దాటిందని, గ్రహ గతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయన్న మాధవన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ క్రమంలోనే కొందరు నెట్టిజన్ లు సైన్స్ గురించి తెలియకపోతే నోటికి వచ్చినది మాట్లాడకు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.

ఇలా నెటిజన్లు పెద్ద ఎత్తున మాధవన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై మాధవన్ స్పందించారు.

"""/" / ఈ సందర్భంగా ఆయన మరో సారి ఈ వార్తలపై స్పందిస్తూ.

నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే.ఇయర్ బుక్‌ను తప్పుగా తమిళ్‌లో పంచాంగం అని చెప్పాను.

నా అజ్ఞానంతోనే అలాంటి మాటలు మాట్లాడానని ఈ సందర్భంగా మాధవన్ స్పందించారు.ఇలా నేను అజ్ఞానంతో మాట్లాడిన మాటలు ఈ విజయాన్ని ఏమాత్రం తక్కువ చేయలేవు.

ఆ మిషన్ ఇప్పటికీ రికార్డు అంటూ ఆయన స్పందించారు.ప్రస్తుతం మాధవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“ఆచార్య”కి ముందు చిరంజీవి కెరీర్‌లోనే ది వరస్ట్ సినిమాలు అంటే ఇవే!