Director Krish : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పాత్రపై మాదాపూర్ డీసీపీ కీలక వ్యాఖ్యలు..!!

రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసుకు( Radisson Blu Drugs Case ) సంబంధించి అనూహ్యంగా డైరెక్టర్ క్రిష్ ( Director Krish )పేరు తెరపైకి రావటం సంచలనం సృష్టించింది.

పోలీసులు ఎనిమిదవ నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరు చేర్చారు.ఈ అంశంపై క్రిష్ స్పందించి తాను హోటల్ కి వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించారు.

ఫ్రెండ్ కాల్ చేయటంతో అక్కడికి వెళ్లినట్లు స్పష్టం చేయడం జరిగింది.కేవలం ఒక గంట మాత్రమే గడిపినట్లు ఆ తర్వాత వెంటనే తాను అక్కడ నుంచి బయలుదేరినట్లు క్రిష్ తెలిపారు.

"""/" / డ్రగ్స్ వ్యవహారానికి కారణమైన వివేకానంద్( Vivekanand ) ను కలిసేందుకే క్రిష్ ఎక్కడకు వెళ్లాడా లేదా మరో కామన్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లాడా అనేది స్పష్టత లేదు.

పోలీసులకు అన్ని వివరాలు వెల్లడించినట్లు తెలియజేశారు.పరిస్థితి ఇలా ఉండగా రాడిసన్ డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు పూర్తిగా నిర్ధారణ కాలేదని మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు.

ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు.'ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం.

ఆ హోటల్ లో చాలా సార్లు పార్టీలు చేసుకున్నట్లు నిందితులు చెప్పారు.పలువురు నిందితులు పరారీలో ఉన్నారు.

వివేకానంద, కేదార్, నిర్భయ్ కొకైన్ సేవించినట్లు పరీక్షల్లో తేలింది' అని డీసీపీ వినిత్ స్పష్టం చేశారు.

వీడియో: గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి డేంజరస్ స్టంట్.. చివరికి?