చాక్లెట్‌తో దోశ వేశాడు.. మార్కెట్‌లో వెరైటీ ఫుడ్

సోషల్ మీడియా( Social Media )లో ఇటీవల వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తయారుచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కొంతమంది వినూత్నంగా ఉండేలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తయారుచేస్తున్నారు.దీంతో వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల బీర్ తో ఆమ్లెట్ తయారుచేసిన వీడియో వైరల్ అయింది.ఈ క్రమంలో తాజాగా అలాంటి తరహాలో చాక్లెట్ తో దోస( Chocolate Dosa )తయారుచేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి చాక్లెత్ తో దోశ వేస్తున్నాడు.ఇది చూసిన నెటిజన్లు.

చాక్లెట్ తో దోశ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. """/" / దోశలో చాలా రకాలు ఉంటాయి.

ఉల్లిపాయ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, పిజ్జా దోశ, ఉప్మా దోశ లాంటి చాలా వెరైటీలు ఉంటాయి.

కానీ ఈ చాక్లెట్ దోశను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి టిఫిన్ సెంటర్ లో చాక్లెట్ తో పెనం మీద దోశ వేస్తున్నాడు.

కిట్ క్యాట్ తో దోశ తయారుచేయడమే కాకుండా దోశ తయారుచేసిన తర్వాత పైన చీజ్ ను వేసిన తర్వాత కిట్ క్యాట్ చాక్లెట్( Kitkat Chocolate ) తో డెకరేట్ చేశాడు.

ఈ వెరైటీ దోశను తినేందుకు చాలామంది ఎగబడుతున్నారు.కొంతమంది చాక్లెట్ దోశ తయారుచేస్తున్న వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.

ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. """/" / ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు.

ఇలాంటి వెరైటీ ఆహారాన్ని తయారుచేసే హోటళ్ల లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది చూసిన తర్వత దోశ తినాలనే ఆసక్తి కూడా పోయిందని మరొకరు కామెంట్ చేశారు.