మదనపల్లె జంట హత్యల కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. !

ఉన్మాదంతో చేసిన పనో, లేక మూడ నమ్మకంతో చేసిన దారుణమో తెలియదు గానీ ఉన్నతమైన విద్యావంతులుగా ఉన్న ఓ జంట కన్న కూతుర్లను అతి కిరాతకంగా బలి తీసుకున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనవరి 24న జరిగిన విషయం తెలిసిందే.

కాగా ఈ జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి.ఈ దారుణానికి ఒడిగట్టిన కన్న తల్లిదండ్రులైన పద్మజ, పురుషోత్తంలను కస్టడిలోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు హజరు పరచగా వారికి జైలు శిక్ష వింధించింది కోర్టు.

కాగా ఈ దంపతులిద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతుండటం గమనించిన న్యాయస్దానం మొదట తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో, ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు.

అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.ఇకపోతే వీరి మీద కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో.

వీరిద్దరికీ మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.అదికూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

కెనడా – బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు.. అమెరికాలో ప్రవాస భారతీయుల ర్యాలీ