కార్తికేయ దెబ్బకు మాచర్ల డౌన్.. మొత్తం కలెక్షన్స్ ఇవే.. బ్రేక్ ఈవెన్ అయ్యేనా?

నితిన్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే గత రెండు మూడు సినిమాలు నితిన్ ను నిరాశ పరిచాయి.

అందుకే ఈసారి మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తాజాగా ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ అయ్యింది.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటించగా.కృతి శెట్టి, క్యాథరిన్ త్రేస్సా హీరోయిన్ లుగా నటించారు.

అలాగే తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ వారు నిర్మించారు.

నితిన్ కెరీర్ కు ఈ సినిమా కీలకంగా మారింది.ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.

మరి అలాంటి సినిమా రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ సినిమా రివ్యూల పరంగా నెగిటివ్ టాక్ రావడంతో ప్లాప్ అని తేలిపోయింది.

కానీ ఈ సినిమాలో అంజలి చిందేసిన రారా రెడ్డి సాంగ్ కొద్దిగా ఓపెనింగ్స్ బాగా రాబట్టడంలో సహాయం చేసింది.

ఈ సినిమా మొత్తంగా చుస్తే ఫస్ట్ డే 4.96 కోట్లు రూపాయల షేర్ రాబట్టింది.

అయితే ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ మీద కార్తికేయ 2 సినిమా బాగా దెబ్బేసింది.

ఈ సినిమా ఆగష్టు 13న రిలీజ్ అయ్యింది.ఈ సినిమా కారణంగా మాచర్ల రెండవ రోజు కేవలం 1.

62 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. """/"/ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.

69 కోట్లు మాత్రమే రాబట్టింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 22 కోట్లు రాబట్టాలి.

మరి పరిస్థితి చూస్తుంటే నితిన్ ఇంకా అంత రాబడతాడు అని అనిపించడం లేదు.

కానీ వీకెండ్ తో పాటు ఆగష్టు 15 కూడా సెలవు కావడంతో కొద్దిగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

మరి ఈ రెండు రోజుల్లో నితిన్ మాచర్ల పుంజుకుంటుందో లేదో చూడాలి.

తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌