20 కోట్లతో తీస్తే వారంలో 50 కోట్లు తెచ్చింది.. ఇప్పుడు తెలుగులో కూడా..!
TeluguStop.com
లాస్ట్ వీక్ కోలీవుడ్ లో రిలీజైన మామన్నన్( Maamannan Movie ) సినిమా సూపర్ హిట్ అందుకుంది.
సినిమాలో వడివేలు, ఉదయనిధి స్టాలిన్,( Udayanidhi Stalin ) ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్( Keerthy Suresh ) లాంటి స్టార్స్ నటించారు.
వడివేలు కెరీర్ లో ఫస్ట్ టైం ఒక సీరియస్ పాత్రలో నటించారు.మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.
కర్ణన్ సినిమా తీసిన మారి సెల్వ రాజ్ మామన్నన్ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తీస్తే వారం లో 50 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
"""/" /
ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో నాయకుడు( Nayakudu Movie ) టైటిల్ తో ఈ సినిమా వస్తుంది.
నాయకుడు పర్ఫెక్ట్ టైటిల్ అని తమిళంలో సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ అంటున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ నాయకుడు తెలుగు రిలీజ్ చేస్తున్నారు.ఆల్రెడీ వడివేలు, కీర్తి సురేష్ తెలుగు ఆడియన్స్ కు పరిచయమే కాబట్టి ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.
మరి నాయకుడు ఏం చేస్తాడో చూడాలి.
రాజమౌళి మహేష్ సినిమాపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు…. సినిమా వచ్చేది అప్పుడే అంటూ