'మా' అధ్యక్షులు మంచు విష్ణు హాట్ కామెంట్స్
TeluguStop.com
'మా' అధ్యక్షులు మంచు విష్ణు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ధర్నాలు, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని తెలిపారు.
'మా'కు వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టినా అనర్హులుగా పరిగణిస్తామని చెప్పారు.ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే 'మా' ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మోహన్ బాబు, గిరిబాబు, జయసుధ, స్వప్నదత్ లు ఉంటారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు స్పష్టం చేశారు.
తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?