యమ్ 6 చిత్ర నిర్మాత విశ్వ‌నాథ్ త‌న్నీరు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై గతం లో "యమ్ 6" చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పుట్టిన రోజు డిసెంబర్ 6.

ఈ సందర్భం గా ఆయ‌న మాట్లాడుతూ తన తదుపరి చిత్ర విశేషాలను తెలియజేసారు.

గతంలో " యమ్ 6" చిత్రాన్ని నిర్మించాను.ప్రస్తుతం నా దర్శకత్వంలో ఓ హార్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాను.

ఈ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంటుంది.ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం పాటల రికార్డింగ్ చేస్తున్నాము.సింగర్ దీపు తో మొదటి పాట రికార్డు చేసాం.

ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.ఈ సినిమాకి కథ, మాటలు: వేమగిరి, సంగీతం: విజయ్ కూరాకుల, పాటలు: మౌనశ్రీ మల్లిక్, కో- డైరెక్టర్స్: సూర్య ఆలంకొండ, శ్రవణ్ కుమార్ వీర్లపాటి , స్క్రీన్ ప్లే - నిర్మాత , దర్శకత్వం : విశ్వనాథ్ తన్నీరు.

దేవరను వర ఎందుకు చంపాడు… సమాధానం చెప్పిన తారక్!