మరోసారి ఏసీబీ కోర్టుకు చంద్రబాబు లాయర్ లూథ్రా

విజయవాడలోని ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదిలా ఉండగా చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవ్యాది సిద్దార్థ్ లూథ్రా మరోసారి ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారని తెలుస్తోంది.

కేసుకు సంబంధించి కొన్ని పేపర్లను ఆయన తన వెంట తీసుకువచ్చారని సమాచారం.అయితే స్కాం కేసుపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఏ తీర్పును చెబుతుందోనన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఏసీబీ కోర్టు వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.దీంతో నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారని సమాచారం.

అరటి పండుతో ఇలా చేశారంటే యవ్వనమైన మెరిసే చర్మం మీ సొంతం!