అమరావతి రైతుల లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
TeluguStop.com
అమరావతి రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
పాదయాత్రపై సింగిల్ జడ్జి ఆదేశాల్లోని ఆంక్షలు ఎత్తివేయాలని రైతులు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో రెగ్యులర్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది.
మంగళ వారం రెగ్యులర్ బెంచ్ లో పిటిషన్ విచారణకు ధర్మాసనం అనుమతిని ఇచ్చింది.
అయితే, సంఘీభావం తెలిపే వారు యాత్రలో పాల్గొనవద్దని, పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 600 మందిని మాత్రమే పోలీసులు పాదయాత్రకు అనుమతిస్తున్నారు.ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరించింది.
ఉసిరి గింజలను పారేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలిస్తే షాకైపోతారు!