మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి

నల్లగొండ జిల్లా:మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు అందించాలని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రెబక సూచించారు.

దేవరకొండ పట్టణంలోని స్థానిక వడ్డెరవాడ పాఠశాల ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వంటగదిలోని వంట సామాగ్రిని, మధ్యాహ్న భోజన రిజిస్టర్ లను తనిఖీ చేశారు.ప్రతి తరగతి గదిని పరిశీలించి,విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరీక్షించారు.

వారి వెంట ప్రధానోపాధ్యాయులు పొట్ట ప్రేమయ్య, ఉపాధ్యాయులు జి.విక్టోరియారాణి,జె.

శోభ, ఎస్.బాలయ్య తదితరులు అన్నారు.

ఖాళీ క‌డుపుతో కాఫీ తాగితే ఏం అవుతుందో తెలుసా?