మధ్యాహ్న భోజనంలో అస్స‌లు తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే!

రోజంతా యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా ఉండాలంటే ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ ఎంత అవ‌స‌ర‌మో, మ‌ధ్యాహ్నం భోజ‌నం కూడా అంతే అవ‌స‌రం.

అయితే చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఏవి ప‌డితే అవి లాగించేస్తుంటారు.అవి ఆరోగ్య‌మా.

? కాదా.? అన్న ఆలోచ‌నే ఉండ‌దు.

ముఖ్యంగా బ‌య‌ట భోజ‌నం చేసే ఉద్యోగ‌స్తులు ఆక‌లి తీర్చుకునేందుకు ఏదో ఒక ఆహారాన్ని పొట్ట‌లోకి తోసేస్తుంటారు.

కానీ, నిజానికి మ‌ధ్యాహ్న భోజ‌నంలో కొన్ని కొన్ని ఆహారాలు అస్స‌లు తీసుకోరాదు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ఉద్యోగ‌స్తుల్లో చాలా మంది మ‌ధ్యాహ్న భోజ‌నంలో బర్గర్ మరియు పిజ్జా వంటివి తింటుంటారు.

కానీ, రెగ్యుల‌ర్‌గా ఇటువంటి ఆహారాల‌ను తీసుకుంటే ఊబకాయానికి దారి చేస్తుంది.మ‌రియు ఇమ్యూనిటీ సిస్ట‌మ్ డ్యామేజ్ అవ్వ‌డం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను సైతం ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

చాలా మంది భోజ‌నం చేయ‌డానికి ముందు సూప్ తాగుతారు.కానీ, మ‌ధ్యాహ్నం భోజనంలో సూప్ తీసుకోరాదు.

సూప్ తీసుకుంటే.ఆక‌లి పెరిగి ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే మ‌ధ్యాహ్నం తీసుకునే ఆహారాల్లో స‌లాడ్లు కూడా ఉండ‌కుండా చూసుకోవాలి.లంచ్‌లో స‌లాడ్లు తీసుకుంటే కొంత స‌మ‌యానికే మ‌ళ్లీ ఆక‌లి వేస్తుంది.

దాంతో మ‌న‌సు చిరు తిండ్ల‌పై మ‌ల్లుతుంది. """/"/ నూడుల్స్, పాస్తా వంటి ఆహారాల‌ను కూడా లంచ్‌లో ప్రిఫ‌ర్ చేయ‌రాదు.

ఇవి తిన‌డానికి ఎంత రుచిగా ఉన్న‌ప్ప‌టికీ.ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.

ముఖ్యంగా ఇటువంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం అధిక బ‌రువు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

ఇక కొంద‌రు డైటింగ్ పేరుతో మ‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌కుండా జ్యూస్‌లు తాగుతుంటారు.కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల మీ ఎన‌ర్జీ ల‌వెల్స్ ఇట్టే డైట్ అయిపోతాయి.

దాంతో ప‌నిపై ఏకాగ్ర‌త్త లోపిస్తుంది.అందుకే భోజ‌నాన్ని స్కిప్ చేయ‌రాదు.

కిర్గిజ్‎స్థాన్‎లో తెలుగు విద్యార్థి మృతి..!