నిన్న యూపీ, నేడు తమిళనాడు: భారత్‌లో విస్తరిస్తోన్న ఎన్ఆర్ఐ యూసఫ్ అలీ వ్యాపార సామ్రాజ్యం

విదేశాల్లో వ్యాపార వేత్తలుగా రాణిస్తున్న పలువురు ఎన్ఆర్ఐలు.భారత్‌లో సైతం పెట్టుబడులు పెడుతూ మనదేశ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఈ కోవకే చెందుతారు లులూ గ్రూప్ అధినేత , కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు యూసుఫ్ అలీ.

కేరళలో జన్మించిన అలీ.అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్‌కు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, భారత్, మలేషియా, ఇండోనేషియాలో ఉన్న 220కి పైగా హైపర్‌ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ద్వారా 57వేల మంది ఉపాధి పొందుతున్నారు.

  ఈ మధ్య అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా 2021లో యూసుఫ్‌ అలీ స్థానం సంపాదించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన భారత్‌ లోనూ తన వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టారు.

ఇప్పటికే లులూ  గ్రూప్‌కు మనదేశంలోని కొచ్చి, త్రిస్సూర్, త్రివేండ్రం, బెంగళూరు నగరాల్లో పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

వీటిని ఇతర రాష్ట్రాలకు, నగరాలకు కూడా విస్తరించాలని యూసఫ్ అలీ భావిస్తున్నారు.గతేడాది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రూ.

2వేల కోట్లతో మోడ్రన్ షాపింగ్ నిర్మిస్తున్నట్లు లులూ గ్రూప్ ప్రకటించింది.30 నెలల్లో దీనిని పూర్తి చేయనున్నారు.

తద్వారా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని లులూ గ్రూప్ తెలిపింది.ఆ తర్వాత ఉత్తర‌ ప్రదేశ్‌లో రూ.

500 కోట్లతో గ్రేటర్ నోయిడాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించ బోతున్నట్లు ప్రకటించింది.

దీని ద్వారా 700 మంది ప్రత్యక్షంగా.1500 మంది పరోక్షంగా ఉపాధి పొందుతారని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం యూపీ ప్రభుత్వం గ్రేటర్ నోయిడాలో 20 ఎకరాల స్థలాన్ని సైతం కేటాయించింది.

ఇప్పటికే లులూ గ్రూపు లక్నోలోని అమర్ షాహీద్ పాత్‌లో రూ.2వేల కోట్లతో భారీ హైపర్‌ మార్కెట్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

"""/" / తాజాగా తమిళనాడు లోనూ భారీ పెట్టుబడికి ముందు కొచ్చింది లులూ గ్రూప్.

రాష్ట్రంలో షాపింగ్‌ మాల్స్‌, హైపర్‌ మార్కెట్స్‌, ఫుడ్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఈ సంస్థ రూ.

3,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ఈ మేరకు సోమవారం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చు కుంది.

ముఖ్య మంత్రి స్టాలిన్‌, గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ సమక్షంలో ఇరు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

ఈ నేపథ్యంలో త్వరలో లులూ గ్రూప్‌నకు చెందిన ఉన్నత స్థాయి ప్రతి నిధుల బృందం తమిళనాడులో పర్యటించి స్థల పరిశీలన, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయనుంది.

ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?