తెలంగాణలో గ్యాస్ హోమ్ డెలివరీకి బ్రేక్.. ఎందుకంటే..!

తెలంగాణాలో ఈ నెల 29 నుండి గ్యాస్ సిలిండర్లు హోం డెలివరీని ఆపేస్తున్నట్టు తెలుస్తుంది.

కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో గ్యాస్ డీలర్లకు లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నారు.

ఈ క్రమంలో ఎల్.పీ.

జీ డీలర్ల కార్యవర్గ సంఘాలు తమని కూడా ఫ్రంట్ లైన్ వారియస్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్యాస్ డెలివరీ బోయ్స్, డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణాలో కరోనా వల్ల 40 మంది గ్యాస్ సిబ్బంది మృతి చెందినట్టు తెలుస్తుంది.

తమని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తేనే హోం డెలివరీ చేయగలమని లేదంటే 29 నుండి హోం డెలివరీని ఆపేస్తున్నట్టు వెల్లడించారు.

అయితే తెలంగాణాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించారు.30 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్న దాని మీద ఎల్.

పీ.జీ సిబ్బందిల హోం డైలివరీ కొనసాగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తెలంగాణాలో లాక్ డౌన్ వల్ల కొద్దిగా కేసులు తగ్గాయని చెబుతున్నారు.అయితే లాక్ డౌన్ పొడిగించే అంశంపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుంది.

 అయితే ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా గ్యాస్ అనేది తప్పనిసరిగా ఉండాలి.మరి అలాంటప్పుడు గ్యాస్ డెలివరీ ఆపేస్తే మాత్రం ప్రజలు ఇబ్బందిపడే అవకాశం ఉంది.

చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తా..: కిషన్ రెడ్డి