ఆలయాల్లో పూజలు, తర్వాత హుండీల్లో చోరీలు చేస్తున్న ప్రేమజంట!
TeluguStop.com
ప్రేమికులు గాఢమైన బంధంలో ఉంటారు.ఒకరికొకరు సాయం చేసుకుంటారు.
కష్టాల్లో, నష్టాల్లో తోడుగా నిలబడతారు.బాధ ఉంటే తమతో పంచుకుని దానిని తగ్గించేందుకు సాయం చేస్తారు.
ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తారు.వారిద్దరూ కలిసి ఉండేందుకు కూడా ఇద్దరూ చాలా కష్టపడతారు.
పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాలను ఒప్పించడంలో కూడా ఒకరికొకరు సాయంగా ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ప్రేమ జంట అలాంటిలాంటిది కాదు.
ఈ లవర్స్ గురించి తెలుసుకుంటే మీరూ ఆశ్చర్యపోవడం ఖాయం.కావాలంటే తెలుసుకోండి.
ఆలయాల్లో పూజలు చేసి ఎవరూ లేని సమయం చూసి హుండీల్లో దొంగతనాలు చేస్తోంది ఓ ప్రేమ జంట.
ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో చోటు చేసుకుంది.మరవంతె ఆలయ గర్భగుడిలోకి ఓ ప్రేమ జంట ప్రవేశించింది.
తర్వాత ఎవరూ లేని సమయం చూసుకుని హుండీలో చోరీకి ప్రయత్నించింది.ఈ ఘటన ఆగస్టు 9వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది.
తలుపులు పగుల గొట్టి కుందాపూర్ త్రాసి సమీపంలోని శ్రీ మహారాజా స్వామి, శ్రీ వరాహ ఆలయంలోకి ప్రవేశించింది ఈ ప్రేమ జంట.
వరాహ విష్ణు నరసింహుని విగ్రహాన్ని తాకి అపవిత్రం చేశారు ఈ యువతీ యువకులు.
తర్వాత అక్కడ ఏమీ దొరక్క పోవడంతో అక్కడి నుండి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు.
అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు గుడిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఆ దృశ్యాలను సేకరించిన పోలీసులు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hell Spin CA Review And Player Reputation: Platform Mechanics And Banking