పెళ్లికి కులం అడ్డు వచ్చింది.. ఆత్మహత్య చేసుకున్నారు!

కాలాలు మారుతున్నాయి కానీ మనిషి మారటం లేదు.ప్రేమ అంటే చాలు ఏదో పెద్ద తప్పు చేసేసినట్టే అని ఇంకా 1940 కాలంలో బతుకుతున్నారు కొందరు తల్లితండ్రులు.

అవును వారి ప్రేమ మీకు నచ్చలేదు.వారి కులం మీకు సరి తూగదు.

కానీ ప్రేమ అనేది మీకంటే ఎక్కువ ఉంది అనేది గమనించుకోవాలి కదా! కులం.

మతం మర్చిపోయే ప్రేమించుకున్నారు అంటేనే చెప్పాలి వారి ప్రేమ ఎంత గొప్పది అనేది.

కానీ అర్ధం చేసుకోరు .మర్యాదగా చెప్పిన సరే మా కులం.

మా మతం అంటారు.ఇంట్లోవాళ్ళని ఒప్పించే ఓపిక లేక వారిని కాదు అని పారిపోయే దైర్యం లేక అత్యంత కష్టంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు.

అలాంటి ఘటనే తాజాగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక ఇంటర్ కళాశాలలో చదువుతుంది.అయితే పక్క గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ని ఆ బాలిక ప్రేమించింది.

దీంతో ఇద్దరూ కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.కానీ, ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయం వారిని వెంటాడింది.

దీంతో కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదాం అని ఫిబ్రవరి 15న ఇంట్లో నుండి పారిపోయారు.

వీరి కోసం కుటుంబీకులు, బంధవులు చుట్టుపక్కలంతా గాలించారు.కానీ ఎక్కడ కనిపించలేదు.

దీంతో పోలీసులుకు ఫిర్యాదు చెయ్యగా మేటిమంద అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రేమజంట ఆత్మహత్యతో రెండో కుటుంబాల్లో తీరాని విషాదం నెలకొంది.