ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకరితో…చివరికి ఏమైంది?

నల్గొండ జిల్లా:మిర్యాలగూడ ప్రేమ పేరుతో సహజీవనం చేసిన ఎస్సైపై ఓ యువతి ఫిర్యాదు చేయగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆ ఎస్సైని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా దురాజ్ పెళ్లికి చెందిన ధరావత్ విజయ్​ మల్కాజిగిరి సీసీఎస్​లో ఎస్సైగా పనిచేస్తున్నారు.

మిర్యాలగూడ మండలం కాల్వపల్లి తండాకు చెందిన ఓ యువతి (పంచాయతీ కార్యదర్శి) ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో 2014 నుంచి స్నేహంగా ఉండేవారు.

ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విజయ్​ ఆ యువతితో సహజీవనం చేశాడు.

ఆరేండ్ల క్రితం విజయ్ వేరే మహిళని వివాహం చేసుకున్నాడు.తన పరిస్థితి ఏంటని బాధిత యువతి ప్రశ్నిస్తే భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే వివాహం చేసుకుంటానని చెబుతూ,ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలనూ చెడగొడుతున్నాడు.

భార్యతో కాపురం,యువతితో సహజీవనం కొనసాగిస్తున్న క్రమంలో పెళ్లి చేసుకోవాలని బాధిత యువతి విజయ్​ను నిలదీయగా దాటవేశాడు.

ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్న బాధిత యువతి ప్రేమ,పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడని విజయ్ కుమార్ పై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

కేసు నమోదుతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఆ ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రోజు ఉదయం ఈ పొడిని తీసుకుంటే మలబద్ధకం సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు!