లవ్‌స్టోరి టీజర్‌ను రెడీ చేస్తోన్న చైతూ

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లవ్‌స్టోరి ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఈ సినిమాతో మరోసారి ఫిదా లాంటి సక్సె్స్ కొట్టాలని ఈ డైరెక్టర్ చూస్తున్నాడు.

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను శేఖర్ కమ్ముల తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ టీజర్స్, ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచాయి.

కాగా ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా అది కుదర్లేదు.

దీంతో ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగేశ్వర్ రావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 20న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ టీజర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చడమే కాకుండా, వారికి ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాతో నాగచైతన్య, సాయి పల్లవి పెయిర్ సూపర్ హిట్ కానుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తుండగా, పవన్ అనే సంగీత దర్శకుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

శేఖర్ కమ్ముల ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి్స్తుండటంతో, మరోసారి క్లీన్ మూవీని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఇక ఈ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తికి తెరపడాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు..: కేటీఆర్