ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్న లవ్ స్టోరీ
TeluguStop.com
క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి, యంగ్ హీరో నాగ చైతన్య జోడీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ స్టొరీ.
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీగా ఉంది.
అయితే రిలీజ్ చేద్దామని అనుకునే సమయానికి కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ రావడంతో వాయిదా పడింది.
ఆ తరువాత లవ్ స్టొరీ సినిమా ఒటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది.
చాలా ఒటీటీ ఛానల్స్ ఈ మూవీని తమ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలకి భారీ మొత్తంలో ఆఫర్ చేశాయి.
అయితే ఎవరు ఎంత ఇస్తామని చెప్పిన నిర్మాతలు మాత్రం థియేటర్ రిలీజ్ వైపే మొగ్గు చూపించారు.
థియేటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడే నేరుగా లవ్ స్టొరీని రిలీజ్ చేస్తామని అంత వరకు వెయిట్ చేస్తామని నిర్మాతలు క్లారిటీగా చెప్పేశారు.
ఒటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.అనుకున్నట్లుగానే ఇప్పుడు సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే తెలంగాణలో కంప్లీట్ థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి.ఏపీలో కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చారు.
ఈ నేపధ్యంలో లవ్ స్టొరీ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.అన్ని అనుకూలంగా ఉంటే ఈ నెల 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు.
పరిస్థితి బట్టి అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామని స్పష్టం చేశారు.క్రేజీ బ్యూటీ సాయి పల్లవి కారణంగా ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్న నేపధ్యంలో కచ్చితంగా థియేటర్స్ లో సినిమాకి మంచి హైప్ ఉంటుందని నిర్మాతల ఆలోచన.
వైరల్: పాము, ముంగీస ఫైటింగ్ చూడండి… అరాచకం అంతే!